సద్గురు ట్వీట్‌.. నెటిజన్ల ఆగ్రహం

హైదరాబాద్‌: ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సోషల్‌ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు గురవుతున్నారు. 18 రోజుల వ్యవధిలో ఐదు స్వర్ణాలు గెలుచుకొని యావత్‌ భారతావని దృష్టిని ఆకర్షించిన అథ్లెట్‌ హిమ దాస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సద్గురు ట్వీట్‌ చేశారు. ‘హిమదాస్‌కు శుభాకాంక్షలు, అదేవిధంగా బ్లెస్సింగ్స్‌’అంటూ పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ట్వీట్‌లో ‘Golden Shower For India’అని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అసభ్యపద జాలం అంటూ సద్గురుకు వ్యతిరేకంగా కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *